: అక్బరుద్దీన్ పూణే ర్యాలీకి అనుమతి నిరాకరణ


ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఓవైసీ ర్యాలీకి పూణే పోలీసులు అనుమతి నిరాకరించారు. నవంబర్ 1 న పూణే నగరపాలిక ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో తమ పార్టీ అభ్యర్థి మణియార్ తరపున సోమవారం నిర్వహించనున్న ఈ ర్యాలీలో ఒవైసీ పాల్గొనాల్సి ఉంది. అయితే, ఘర్షణలకు దారితీసే అవకాశముండటంతోనే ఈ ర్యాలీకి అనుమతించడం లేదని పోలీసులు తెలిపారు. శాంతి భద్రతలకు భంగం కల్పించే ఎటువంటి ర్యాలీలకు, ప్రచార సభలకు అనుమతించేది లేదని పోలీసులు పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News