: మరో వికెట్ కోల్పోయిన టీమిండియా


దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో 44 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ కోల్పోయింది. రబడ బౌలింగ్ లో షాట్ కొట్టబోయిన కోహ్లి(7), కీపర్ డీకాక్ కు క్యాచ్ ఇచ్చాడు. కోహ్లి కొట్టిన బంతి బ్యాట్ అంచుకు తాకుతూ వెళుతుండగా డికాక్ అద్భుతంగా డైవ్ చేసి మరీ ఈ క్యాచ్ పట్టుకోవడంతో భారత్ రెండో వికెట్ కోల్పోయింది. 439 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 22 పరుగుల వద్ద, అబాట్ బౌలింగ్ లో మొదటి వికెట్ గా రోహిత్ శర్మ (16) అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో తాహిర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ అవుటయ్యాడు.

  • Loading...

More Telugu News