: ఐదో వన్డేలో తొలి వికెట్ కోల్పోయిన భారత్
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న ఐదో వన్డేలో భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 439 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్, 22 పరుగుల వద్ద, అబాట్ బౌలింగ్ లో రోహిత్ శర్మ (16) అవుటయ్యాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో తాహిర్ క్యాచ్ పట్టడంతో రోహిత్ పెవిలియన్ కు చేరాడు. కాగా, ఓపెనర్ రోహిత్ శర్మ తొలి ఓవర్ లోనే రెండు ఫోర్లు కొట్టాడు. స్టెయిన్ ఓవర్ లో చివరి రెండు బంతుల్ని బౌండరీకి తరలించాడు.