: లండన్ లో విశ్వేశ్వరుని విగ్రహాన్ని ఆవిష్కరించనున్న మోదీ


లండన్ లో విశ్వేశ్వరుని విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ప్రకటించారు. వచ్చే నెలలో తాను బ్రిటన్ లో పర్యటించనున్నట్లు చెప్పారు. విశ్వేశ్వరుడు ఆ కాలంలోనే ప్రజాస్వామ్యం కోసం, మహిళా సాధికారత కోసం పాటుపడ్డాడన్న విషయాన్ని యావత్తు ప్రపంచానికి తెలియజెప్పాలని, అందుకే ఆయన విగ్రహాన్ని లండన్ లో నెలకొల్పుతున్నట్లు మోదీ అన్నారు. లండన్ లో అంబేద్కర్ నివసించిన భవనం వద్ద కూడా ఒక స్మారక చిహ్నాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఈ భవనాన్ని మహారాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే కొనుగోలు చేసింది. ఆ భవనాన్ని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ మ్యూజియం అండ్ మెమోరియల్ గా మార్చనుంది.

  • Loading...

More Telugu News