: ‘కామన్ అడిక్టివ్ ఫుడ్స్’లో ఆ రెండూ!


అత్యంత అడిక్టివ్ ఫుడ్స్ (వ్యసనానికి గురి చేసే ఆహారపదార్థాలు)లో చాకోలెట్, పిజ్జాలు మొదటి స్థానంలో ఉన్నాయని కొత్త అధ్యయనంలో వెల్లడైంది. ఒక ప్రత్యేక పద్ధతి ద్వారా తయారైన ఇటువంటి ఆహారపదార్థాల కారణంగా ఈటింగ్ డిజార్డర్ (తిండి లోపం) లేదా అడిక్షన్ (వ్యసనం) వంటి సమస్యలు తలెత్తుతాయని ఈ అధ్యయనం ద్వారా తెలిసింది. ‘కామన్ అడిక్టివ్ ఫుడ్స్’ (వ్యసనానికి గురి చేసే సాధారణ ఆహారపదార్థాలు) అనే అంశంపై యూనివర్శిటీ ఆఫ్ మిచిగాన్, కొలంబియా యూనివర్శిటీకి చెందిన న్యూయార్క్ ఒబెసిటీ రీసెర్చి సెంటరు పరిశోధన చేశాయి. పరిశోధకుల బృందం సుమారు 35 రకాల ఆహార పదార్థాలను విశ్లేషించింది. మిచిగాన్ యూనివర్శిటీకి చెందిన 120 మంది అండర్ గ్రాడ్యుయేట్లపైన, దాదాపు 400 మంది పెద్దలపైన ఈ సర్వే నిర్వహించింది. ఈ అధ్యయనానికి గాను యేల్ ఫుడ్ అడిక్షన్ స్కేల్ ను ఉపయోగించారు. మనం చాలా అధికశాతం కోరుకునే ఆహారపదార్థాల జాబితాలో మొట్టమొదట ఉండేది చాకోలెట్. దాని తర్వాత స్థానాల్లో వరుసగా ఐస్ క్రీమ్, ఫ్రెంచ్ ఫ్రైస్, పిజ్జా, కుకీస్ ఉన్నాయని ‘టెక్ టైమ్స్’లో పేర్కొన్నారు. వీటితో పాటు చీజ్, ఫ్రైడ్ చికెన్, సోడా, కేక్ లు కామన్ అడిక్టివ్ ఫుడ్స్ జాబితాలోని టాప్-20లో ఉన్నాయి.

  • Loading...

More Telugu News