: సఫారీల సిక్సర్లు, ఫోర్లతో వాంఖడే మోగిపోతోంది
సిక్సర్లు, ఫోర్లతో వాంఖడే స్టేడియం మార్మోగిపోతోంది. డివిలియర్స్, డుప్లెసిస్ దూకుడుతో ప్రతి మూడు బంతులకు ఒక ఫోర్ లేదా సిక్స్ నమోదవడంతో సఫారీల ఇన్నింగ్స్ లో వేగం పెరిగింది. సౌతాఫ్రికా టీట్వంటీ కెప్టెన్ డుప్లెసిస్, వన్డే కెప్టెన్ డివిలియర్స్ భారత బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. పేస్ బౌలరా? స్పిన్ బౌలరా? అన్న దానితో సంబంధం లేకుండా ప్రతి ఓవర్ లో ఓ సిక్స్ లేదా ఫోర్ లేదా ఒకే ఓవర్లో రెండూ కొడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టిస్తున్నారు. ఈ క్రమంలో డికాక్ (109), డుప్లెసిస్ (100) సెంచరీలు నమోదు చేయగా, డివిలియర్స్ ( 47 బంతుల్లో 77) అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. దీంతో సౌతాఫ్రికా జట్టు భారీ స్కోరు దిశగా సాగిపోతోంది. ప్రస్తుతం సౌతాఫ్రికా జట్టు 42 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 316 పరుగులు చేసింది. భారత బౌలర్లలో మోహిత్ శర్మ, రైనా చెరో వికెట్ తీశారు. ఇలాగే ఆడితే నిర్ణీత 50 ఓవర్లలో 400 పరుగుల మార్కు చేరుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.