: టీట్వంటీని తలపించిన సఫారీల బ్యాటింగ్


మహాత్మాగాంధీ-నెల్సన్ మండేలా ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా భారత్-సౌతాఫ్రికా మధ్య ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరుగుతున్న చివరి వన్డేలో సఫారీలు చెలరేగిపోతున్నారు. ఓపెనర్ హషీమ్ ఆమ్లా (23) దూకుడును ప్రారంభించగా, దానిని డికాక్ (85) కొనసాగిస్తున్నాడు. అతనికి డుప్లెసిస్ (29) చక్కని సహకారమందించడంతో భారత బౌలర్లపై నిర్దాక్షిణ్యంగా విరుచుకుపడుతున్నారు. వారి దూకుడుకు వన్డే మ్యాచ్ కాస్తా టీట్వంటీలా మారింది. దీంతో 20 ఓవర్లలో వికెట్ నష్టానికి 142 పరుగులు చేశారు. భారత బౌలర్లలో మోహిత్ శర్మ వికెట్ తీసి రాణించాడు.

  • Loading...

More Telugu News