: మోదీ, కేసీఆర్, చంద్రబాబులు కేవలం పెట్టుబడిదారులను మాత్రమే నమ్ముతున్నారు!: సీపీఎం రాఘవులు
ప్రధాని నరేంద్ర మోదీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ లు కేవలం పెట్టుబడిదారులను మాత్రమే నమ్ముతున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు రాఘవులు విమర్శించారు. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ లో సీపీఎం రాష్ట్ర ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రాజెక్టుల రీ-డిజైన్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, ఆర్థిక మాంద్యంపై ఐఎంఎఫ్ నివేదికను పట్టించుకోవడం లేదని ఆరోపిస్తూ, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, ఏకమొత్తంలో రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ, టీ- సర్కార్ నిరంకుశంగా వ్యవహరిస్తోందని, రాబోయే రోజుల్లో ఉద్యమాలను మరింత ఉద్ధృతం చేస్తామని, వరంగల్ ఉపఎన్నిక కేసీఆర్ పాలనకు రెఫరెండమని అన్నారు.