: నైట్ హాల్ట్ కోసం నిలిపిన ఆర్టీసీ బస్సులో ఆత్మహత్య
జగద్గిరి గుట్టలోని శ్రీరాంనగర్ కు చెందిన మహ్మద్ జమీర్ (36) చిత్తుకాగితాలు ఏరుకుంటూ ఉంటాడు. అతను బస్సులో ఉరేసుకునికి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటనకు సంబంధించిన పోలీసులు తెలిపిన వివరాలు... సికింద్రాబాద్ రాణిగంజ్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నైట్ హాల్ట్ నిమిత్తం కూకట్ పల్లి బస్ స్టాప్ వద్ద పార్కు చేసిన ఆ బస్సు డ్రైవర్ రాజేందర్, కండక్టర్ జంగయ్య రెస్ట్ రూంలో నిద్రపోయారు. తెల్లవారుజామున బస్సు తీసేందుకు వెళ్లిన డ్రైవర్, కండక్టర్లకు బస్సులో ఉరేసుకుని వేలాడుతున్న జమీర్ మృతదేహాన్ని గమనించారు. వెంటనే కూకట్ పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు.