: టాస్ గెలిచిన సౌతాఫ్రికా... బ్యాటింగ్!
ముంబైలో జరుగుతున్న నిర్ణయాత్మక పోరులో సౌతాఫ్రికా జట్టు కెప్టెన్ డెవిలియర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. సమయం గడిచే కొద్దీ పిచ్ మందగిస్తుందని, చివర్లో స్పిన్ కు సహకరిస్తుందని అంచనా వేస్తున్నందున బ్యాటింగ్ ఎంచుకున్నట్టు తెలిపాడు. కాగా, ఈ పిచ్ పై ఇటీవల జరిగిన అన్ని మ్యాచ్ లలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న జట్టే విజయం సాధిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లో టాస్ ఎవరు గెలిస్తే వారు సగం గెలిచినట్టేనని క్రీడాపండితులు సైతం అంచనా వేస్తున్నారు. మరికాసేపట్లో సౌతాఫ్రికా జట్టు బ్యాటింగ్ ఆరంభించనుంది. కాగా, టాస్ పెద్ద సమస్య కాబోదని, తమ జట్టులో ఏడవ డౌన్ లో వచ్చిన వారు సైతం ఈ పిచ్ పై ఆడగలరని ధోనీ వ్యాఖ్యానించాడు. భారత జట్టు: ధోనీ (కెప్టెన్, కీపర్), ఎస్ అరవింద్, ఆర్ అశ్విన్, బిన్నీ, ధావన్, గురుకీరత్ సింగ్, హర్భజన్ సింగ్, విరాట్ కోహ్లీ, భువనేశ్వర్ కుమార్, అమిత్ మిశ్రా, ఏఆర్ పటేల్, రహానే, రైనా, అంబటి రాయుడు, ఎంఎం శర్మ, రోహిత్ శర్మ. (వీరి నుంచి తుది 11 మందిని ఎంపిక చేస్తారు) సౌతాఫ్రికా జట్టు: డివిలియర్స్ (కెప్టెన్), అబాట్, ఆమ్లా, బెహర్డీన్, డికాక్ (కీపర్), డైప్లెసిస్, ఎల్గర్, ఇమ్రాన్ తాహిర్, డీఏ మిల్లర్, మోర్కెల్, మోరిస్, రబడా, స్టెయిన్, జోండో, ఫాంగ్సియో. (వీరి నుంచి తుది 11 మందిని ఎంపిక చేస్తారు)