: మహారాష్ట్రలో దిగొచ్చిన కందిపప్పు ధర... తెలుగు రాష్ట్రాల్లో ఎప్పటికో..?


మహారాష్ట్రలో కందిపప్పును అక్రమంగా దాచి ధరలను నియంత్రిస్తున్న వారిపై ఉక్కుపాదం మోపిన ఫడ్నవీస్ సర్కారు బహిరంగ మార్కెట్లో ధరలను దిగొచ్చేలా చేసింది. పెద్ద ఎత్తున కందిపప్పును నిల్వచేస్తున్న అక్రమార్కులపై ఐదు రోజుల నుంచి అధికారులు దాడులు చేసి మొత్తం 46,397 మెట్రిక్ టన్నుల పప్పుధాన్యాలను స్వాధీనం చేసుకోగా, మిగతా వారి గుండెల్లో వణుకు పుట్టింది. దీంతో వారంతా తమ వద్ద ఉన్న కందిపప్పు నిల్వలను మార్కెట్లోకి పంపారు. అంతే, నిన్నటివరకూ రూ. 200 పలికిన కిలో కందిపప్పు ధర నేడు ఒక్కసారిగా రూ. 150కి తగ్గింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో అధికారులు ఎప్పటికి స్పందించి దాడులకు దిగుతారో? ధరలు ఎప్పుడు అదుపులోకి వస్తాయో?!

  • Loading...

More Telugu News