: అది లంచం కాదు, కాంట్రాక్టర్లు ఇచ్చే చందా మాత్రమే: జేసీ
తాను లంచాలు తీసుకుంటున్నానని వచ్చిన వార్తలు అవాస్తవమని తెలుగుదేశం ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. మీడియాతో తాను చెప్పిన మాటలను వక్రీకరించారని వెల్లడించిన ఆయన, కాంట్రాక్టర్లు ఇస్తున్నది లంచం కాదని, చందా, విరాళాలు మాత్రమేనని అన్నారు. తాను వాటిని డీడీల రూపంలో తీసుకుంటున్నానని, దాన్ని ప్రజల అవసరాలకే వినియోగిస్తున్నానని తెలిపారు. తాను చెప్పిన విషయాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని రఘువీరా, లంచం వ్యాఖ్యలపై స్పందించాలని సీఎం చంద్రబాబును డిమాండ్ చేయడం విడ్డూరమని అన్నారు. లంచమైనా, చందా అయినా, విరాళమైనా... ఏ రూపంలో తీసుకున్నా తప్పుకాదా? అన్న ప్రశ్నకు మాత్రం జేసీ సమాధానం ఇవ్వలేదు.