: ప్రత్యేక హోదాపై కేంద్రాన్ని తొలిసారిగా హెచ్చరించిన బాలకృష్ణ!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై సినీనటుడు, ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ పెదవి విప్పారు. తన మనసులోని మాటను ఈ ఉదయం మీడియా ముందు వెల్లడించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తుందన్న నమ్మకం తనకుందని అన్నారు. ప్రత్యేక హోదా ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని ఆయన హెచ్చరించారు. దశల వారీగా ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుతాయని చెప్పిన ఆయన, అందులో భాగంగానే హోదా వచ్చి తీరుతుందని అన్నారు. పరిస్థితి చేతులు దాటేంతవరకూ కేంద్రం చూస్తూ ఊరుకోదని తాను భావిస్తున్నట్టు తెలిపారు.