: ఆవు రక్తం తాగే కెన్యా వాసులు కూడా వాటిని చంపడం లేదు... ఇక్కడెందుకు జరుగుతోంది?: ఆర్ఎస్ఎస్ చీఫ్


తమ ఆరోగ్యం కోసం గోవుల నుంచి రక్తం సేకరించి తాగే ప్రజలున్న కెన్యా దేశంలో సైతం గోవధపై నిషేధం ఉందని, ఇండియాలో అదే నిర్ణయాన్ని ఎందుకు అమలు చేయడం లేదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రశ్నించారు. నాగపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రసంగిస్తూ, "కరవుకాటకాలు నెలకొన్న సందర్భాలలో కెన్యావాసులు ఆవు రక్తాన్ని తాగుతారు. కానీ వాళ్లు రక్తం సేకరించే విధానం, ఆవు ప్రాణాలకు హాని కలిగించదు. ఆవు మాంసం విక్రయాలు అక్కడ నిషేధం" అన్నారు. ఇండియాలోనూ గోమాంసం అమ్మకాలపై పూర్తి బ్యాన్ విధించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News