: కేటీఆర్ కు ఆరోగ్యం బాగాలేదు... అందుకే రాలేకపోయారు!: బాలయ్య
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు ఆరోగ్యం బాగాలేకపోవడం వల్లే ఆయన 'పింక్ రిబ్బన్ వాక్' కార్యక్రమానికి రాలేకపోయారని హీరో బాలకృష్ణ వెల్లడించారు. ఈ ఉదయం కేబీఆర్ పార్కులో ఆయన మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రావాలని ఆయనను ఆహ్వానించగానే ఆనందంగా అంగీకరించారని, అయితే, ఈ ఉదయం ఒంట్లో బాగాలేకపోయినందున కేటీఆర్ రాలేదని వివరించారు. అయినప్పటికీ, తాను అడగ్గానే ఒప్పుకున్నందుకు ఆయనకు కృతజ్ఞతలని అన్నారు. ప్రజల్లో కేన్సర్ మహమ్మారి పట్ల మరింతగా అవగాహన పెరగాలని, అందుకు మీడియా కృషి చేయాలని అన్నాడు.