: అభిమానులను అయోమయానికి గురి చేశాను... క్షమించండి, బాహుబలి-3 కూడా ఉంటుంది: రాజమౌళి
'బాహుబలి' ఎన్ని భాగాలుగా ఉంటుందన్న విషయంలో గత కొంతకాలంగా వస్తున్న పుకార్లకు దర్శకుడు రాజమౌళి తెరదించాడు. బాహుబలి మూడవ భాగం ఉంటుందని కొద్ది నిమిషాల క్రితం స్వయంగా తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపాడు. అయితే, ప్రస్తుత బాహుబలి కథ రెండవ భాగంతోనే ముగుస్తుందని, బాహుబలి-3 మరో కథతో వస్తుందని స్పష్టం చేశాడు. తాను నిన్న చేసిన ట్వీట్లు అభిమానులను కొద్దిగా అయోమయానికి గురిచేశాయని, అందుకు చింతిస్తున్నానని వెల్లడించిన ఆయన, గతంలో ఎన్నడూ చూడనటువంటి అభుభూతి ఈ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేస్తానని తెలిపాడు. కాగా, నిన్న రాజమౌళి 'బాహుబలి మూడవ భాగం ఉండదు' అన్న అర్థం వచ్చేలా ట్వీట్లు చేసిన సంగతి తెలిసిందే.