: లంచం తీసుకుంటున్నది నిజమే... డబ్బు లేకపోతే ఏం చేయాలి?: జేసీ ప్రభాకర్ రెడ్డి


తాడిపత్రి ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను లంచాలు తీసుకుంటున్నానని అంగీకరించారు. ప్రభుత్వం వద్ద డబ్బులు లేవని సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన, ఈ పరిస్థితుల్లో లంచాలు తీసుకోవడం తప్పెలా అవుతుంది? అని ప్రశ్నించారు. అభివృద్ధి పనులకు ఆమ్యామ్యాలు పుచ్చుకోక తప్పడం లేదని అన్న ఆయన, తీసుకుంటున్న డబ్బును డీడీల రూపంలో స్వీకరిస్తూ, దాన్ని వైట్ మనీగా మారుస్తున్నానని అన్నారు. ఈ డబ్బుతోనే తాడిపత్రిలో పలు డెవలప్ మెంట్ పనులు చేయిస్తున్నానని తెలిపారు. ఇప్పుడిక జేసీ కామెంట్స్ ఎలాంటి వివాదాన్ని రేపుతాయో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News