: మాంత్రికుడిని కలిసిన నితీష్... బీహార్ లో సంచలనం సృష్టిస్తున్న వీడియో


ఎన్నికలు జరుగుతున్న బీహారులో మరో వివాదం తెరపైకి వచ్చింది. తన విజయాన్ని ఆకాంక్షిస్తూ, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఓ మాంత్రికుడిని కలిసినట్టున్న ఓ వీడియోను బీజేపీ విడుదల చేసింది. మహాకూటమిలోని మరో నేత లాలూపై క్షుద్రపూజలు చేయించే పనిలో ఆయన ఉన్నారని బీజేపీ తీవ్ర ఆరోపణలు చేసింది. అందుకు తగ్గట్టుగానే, ఆ మాంత్రికుడు "మీరు లాలూతో ఎందుకు పొత్తు పెట్టుకున్నారు?" అని ప్రశ్నించడం, ఆపై "నితీష్ జిందాబాద్, లాలూ ముర్దాబాద్" అని అనడం వినిపిస్తోంది. నితీష్ సైతం ఆ మాంత్రికుడిని కౌగిలించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ స్పందిస్తూ, లాలూను దూరం చేసుకునేందుకు నితీష్ ఆ మాంత్రికుడి వద్దకు వెళ్లారని ఆరోపించగా, పరిస్థితులు అనుకూలించకుంటే ఏ మంత్రాలూ పనిచేయవని ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఇక విషయం తెలుసుకున్న లాలూ, అందరికంటే తానే పెద్ద మాంత్రికుడినని, నితీష్ వీడియో గురించి తనకు తెలియదని వ్యాఖ్యానించడం గమనార్హం.

  • Loading...

More Telugu News