: 'చిత్రపురి'పై పట్టెవరికో? పోటీలో వందేమాతరం శ్రీనివాస్, కొమరం వెంకటేష్
హైదరాబాద్ లోని సినీ నటులు, కార్మికుల కాలనీ 'చిత్రపురి' ఎన్నికలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. ఈ ఎన్నికల్లో సంగీత దర్శకుడు, గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ ప్యానల్, నిర్మాత కొమరం వెంకటేష్ ప్యానళ్లు బరిలో నిలిచాయి. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ ఓటింగ్ జరగనుంది. చిత్రపురి సంఘంలో మొత్తం 6 వేల మందికి పైగా సినీ కార్మికులు సభ్యులుగా ఉండగా, వారిలో 4 వేల మందికి పైగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటారని తెలుస్తోంది. పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్లను లెక్కించి ఫలితాలను వెల్లడించనున్నారు.