: మోదీ ఉంటేనే బీజేపీకి ఆక్సిజన్... అది పోతే అంతే: శివసేన
దసరా ముగింపు ఉత్సవాలను వైభవంగా నిర్వహించి, భవిష్యత్తులో బీజేపీతో పొత్తు లేకుండానే, ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి దిగుతామన్న సంకేతాలు పంపిన శివసేన, ఆ పార్టీపై తీవ్ర విమర్శలు చేసింది. బీజేపీకి మోదీ రూపంలో ఆక్సిజన్ అందిన కారణంగానే ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని, మోదీ ప్రభావం తగ్గగానే, బీజేపీ కుదేలైపోతుందని శివసేన అధికార పత్రిక 'సామ్నా'లో ప్రత్యేక వ్యాసాన్ని ప్రచురించింది. తమ పార్టీ ఎప్పటికైనా హిందుత్వం, దేశభక్తి వైపు మాత్రమే ఉంటుందని, భావ సారూప్యత ఉన్న పార్టీలతో మాత్రమే కలసి ముందడుగు వేస్తుందని పేర్కొంది. ఈ దసరా వేడుకలను వైభవంగా నిర్వహించడం ద్వారా భవిష్యత్తు తమదేనన్న సంకేతాలు ప్రతి ఒక్కరికీ పంపామని తెలిపింది.