: 'చూడు పిన్నమ్మా...' అంటూ అలరించిన మాడా కన్నుమూత
‘చూడు పిన్నమ్మా... పాడు పిల్లాడు’ అంటూ, తనదైన 'పేడి' క్యారెక్టర్లతో తెలుగు సినీ ప్రేక్షకులకు దగ్గరైన మాడా వెంకటేశ్వరరావు (65) గత రాత్రి 11 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 1950 అక్టోబర్ 10న తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో జన్మించిన మాడా 300కు పైగా చిత్రాల్లో నటించారు. ఆయన అంత్యక్రియలు నేడు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. అందాల రాముడు, ముత్యాల ముగ్గు, చిల్లర కొట్టు చిట్టెమ్మ తదితర చిత్రాల్లో ఆయన నటన అందరినీ ఆకట్టుకుంది. మాడా మృతిపట్ల పలువురు నటీనటులు సంతాపం తెలిపారు.