: ప్రభుత్వాసుపత్రులపై అమలాపురం ఎంపీ సంచలన వ్యాఖ్యలు
ఏ దిక్కూ లేనివారే ప్రభుత్వాసుపత్రులకు వెళ్తున్నారని అమలాపురం ఎంపీ పండుల రవీంద్రబాబు వ్యాఖ్యానించారు. అమలాపురంలో ఆయన మాట్లాడుతూ, కార్పొరేట్ ఆసుపత్రులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నాయని అన్నారు. ధనార్జనకు అలవాటు పడిన ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు విలువలు మర్చిపోయాయని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు ఆసుపత్రులు రోజురోజుకూ పుట్టుకొస్తున్న ప్రస్తుత తరుణంలో ప్రభుత్వాసుపత్రులు నిర్వీర్యమైపోయాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థికంగా చితికిపోయినవారు, ప్రైవేటు ఆసుపత్రుల బిల్లులను భరించలేని పేదలే ప్రభుత్వాసుపత్రులకు వెళ్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.