: జగన్ రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటున్నారు: కళావెంకట్రావు
వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని టీడీపీ నేత కళావెంకట్రావు ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం చేపట్టిన ప్రతి పనిని ప్రతిపక్ష నేత విమర్శించడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష నేత విమర్శలు మాని, రాష్ట్రాభివృద్ధికి సూచనలు చేయాలని ఆయన హితవు పలికారు. జగన్ సొంత అవసరాలకు పార్టీని ఉపయోగించుకుంటున్నారని కళావెంకట్రావు విమర్శించారు. ఇకనైనా జగన్ రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలని ఆయన సూచించారు.