: జంతువుగా పొరపడి మనిషిని కాల్చి, తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు!
ఉత్తరాఖండ్ లోని చమోలీ జిల్లాలో చోటుచేసుకున్న పొరపాటుకు తనకు తానుగా శిక్ష విధించుకున్నాడో వ్యక్తి. వివరాల్లోకి వెళ్తే...తరాలీ ప్రాంతానికి చెందిన గోవర్థన్ అనే వ్యక్తి వేట నిమిత్తం గత రాత్రి అడవిలోకి వెళ్లాడు. ఇంతలో పక్కనే ఉన్న పొదల్లోంచి ఎదో శబ్దం వినిపించడంతో జంతువని భావించి అటువైపు కాల్చాడు. తరువాత దగ్గరకు వెళ్లి చూడగా కాల్పులకు గాయపడింది అతని బంధువైన దర్శన్ లాల్ అని గుర్తించాడు. పొరపాటు జరిగిపోయిందని ఆవేదన చెందిన గోవర్థన్ మనస్తాపంతో తనను తాను కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గోవర్ధన్ అక్కడికక్కడే మృతి చెందగా, దర్శన్ లాల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.