: నవంబర్ 1న 'సైజ్ జీరో' ఆడియో విడుదల
అనుష్క, ఆర్య, సోనాల్ చౌహాన్ ప్రధాన పాత్రధారులుగా ప్రకాశ్ కోవెలమూడి దర్శకత్వంలో 'సైజ్ జీరో' సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆడియో వేడుకను నవంబర్ 1న నిర్వహించనున్నామని ఫేస్ బుక్ పేజ్ ద్వారా అనుష్క ప్రకటించింది. నవంబర్ 27న ఈ సినిమాను విడుదల చేసేందుకు చిత్ర బృందం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే. పీవీపీ బ్యానర్ లో ప్రసాద్ పొట్లూరి ఈ సినిమాను నిర్మించారు. 'సైజ్ జీరో' సినిమాలో భారీకాయంతో సతమతమయ్యే అమ్మాయి పాత్రను అనుష్క పోషించిన సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం అనుష్క బాగా బరువు పెరిగింది.