: కులం, భాష, జాతి పేరుతో దూషణలు వద్దు: సినీ నటుడు సూర్య లేఖాస్త్రం


నడిగర్ సంఘం ఎన్నికలు ముగిసినా ఆ వేడి మాత్రం తగ్గలేదు. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత ప్రముఖ నటి రాధిక మాట్లాడుతూ, కమలహాసన్, విశాల్, కార్తీ సినిమాలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో సాయం చేశానని, అయినా వారికి కృతజ్ఞత లేదని తీవ్రస్థాయిలో విమర్శలు చేసింది. ఎన్నికల వరకు శరత్ కుమార్ వర్గం ఎన్ని విమర్శలు చేసినా స్పందించని సూర్య తాజాగా లేఖాస్త్రం సంధించాడు. ఆ లేఖలో నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు చెబుతూనే దిశానిర్దేశం చేశాడు. 'మీ బాధ్యతల్ని సాయంగా చెప్పుకోకండి' అంటూ వ్యంగ్యంతో కూడిన సూచన చేశాడు. సంఘం పటిష్ఠతకు కృషిచేయాలని సూచించాడు. సీనియర్లను గౌరవించాలని హితవు పలికాడు. కులం, భాష, జాతి పేరుతో దూషణలకు తావివ్వద్దని సూర్య స్పష్టం చేశాడు. ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న అవాంఛనీయ సంఘటనలు భవిష్యత్ లో జరగకుండా చూసుకోవాలని నూతన కార్యవర్గానికి సూచించాడు. కాగా, రేపు నడిగర్ సంఘం నూతన కార్యవర్గ సమావేశం చెన్నైలోని వడపళనిలోని ఆర్ వీకే స్టూడియోస్ ప్రాంగణంలో జరగనుంది. ఇందులో శరత్ కుమార్ వర్గం తరపున పోటీ చేసి గెలుపొందిన రామ్ కీ, నిరోషా, టీపీ గజేంద్రన్, నళిని పాల్గొంటారా? లేదా? అనే ఆసక్తి కోలీవుడ్ లో అందర్లోనూ నెలకొంది.

  • Loading...

More Telugu News