: ఆసుపత్రుల పరిశుభ్రతకు ముంబై కార్పొరేటర్ వినూత్న ప్రతిపాదన


ఆవుపాలే కాదు గోమూత్రం కూడా ఎంతో మంచిదని ముంబై కార్పోరేటర్ పర్మీందర్ భుమ్రా చెబుతున్నారు. ముంబైలో ఆయన మాట్లాడుతూ, గోమూత్రం క్రిమిసంహారిక అని అన్నారు. దీంతోనే తాము ఇంటిని శుభ్రం చేసుకుంటున్నామని, తమలాగే ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులను గోమూత్రంతో శుభ్రం చేసుకోవాలని ఆయన సూచించారు. ముంబై కార్పొరేషన్ మీటింగ్ లో ఆసుపత్రుల్లో గోమూత్రం వినియోగంపై ప్రతిపాదన చేశారు. ఆయన ప్రతిపాదనపై పశు వైద్యులు మండిపడుతున్నారు. గోమూత్రం వ్యవసాయంలో వినియోగిస్తారు తప్ప ఇళ్లల్లో కాదని అన్నారు. వైద్య శాస్త్రం ప్రకారం గోమూత్రం శుభ్రం చేయడానికి ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వారు వివరించారు. కాగా, ఈయన ముంబైలోని మలాద్ నుంచి కాంగ్రెస్ తరపున కార్పొరేటర్ గా ఎన్నికయ్యారు.

  • Loading...

More Telugu News