: ఆత్మహత్య చేసుకున్న తెలంగాణ టాపర్
ఓ చదువుల తల్లి జీవితం అర్థాంతరంగా ముగిసింది. పదవ తరగతిలో తెలంగాణ టాపర్ గా నిలిచిన విద్యా కుసుమం తన జీవితాన్ని అంతం చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా వెంకటాపురానికి చెందిన చీనాల ప్రియాంక (17) కొత్తగూడెంలోని కృష్ణవేణి కాలేజ్ లో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది. దసరా సెలవులు కావడంతో ఊరికి వచ్చింది. ఈ రోజు ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీన్ని గమనించిన స్థానికులు ఆమెను ఆస్పత్రికి తరలించడానికి ప్రయత్నించగా... అప్పటికే ఆమె చనిపోయింది. చదువులో టాపర్ గా ఉన్న ప్రియాంక ఆత్మహత్యకు ఎందుకు పాల్పడిందన్న విషయం ఎవరికీ అర్థం కావడం లేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సూసైడ్ నోట్ ఏమైనా రాసిందా? అని వెతుకుతున్నారు. ప్రియాంక ఆత్మహత్య స్థానికంగా ఆవేదనను నింపింది.