: ఆర్టీసీ ఛార్జీలపై 25లోగా నిర్ణయం తీసుకోకుంటే 26న ధర్నా: అంబటి


పెంచిన ఆర్టీసీ ఛార్జీలను తగ్గిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 25వ తేదీ లోగా నిర్ణయం తీసుకోని పక్షంలో తమ పార్టీ ఆధ్వర్యంలో 26న అన్ని బస్ డిపోల ముందు ధర్నా చేస్తామని వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు తెలిపారు. గుంటూరులో ఆయన మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతుంటే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఆర్టీసీ ధరలు పెరిగాయని విమర్శించారు. ఈ లెక్కన క్రూడాయిల్ ధరలు పెరిగితే సామాన్యుడు బస్సు ఎక్కే అవకాశం ఉండదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రజలను దోచుకునేందుకు టీడీపీ ప్రభుత్వం ఆర్టీసీ టికెట్ ధరలు పెంచిందని ఆయన మండిపడ్డారు. ఎన్నికలప్పుడు ఆర్టీసీ ఛార్జీలను పెంచమని మేనిఫేస్టోలో పేర్కొందని ఆయన గుర్తు చేశారు. ప్రైవేటు బస్సుల యాజమాన్యాలకు సహకరించేందుకు ప్రభుత్వం టికెట్ ధరలు పెంచిందని ఆయన తెలిపారు. ఆర్టీసీలో ధరలు పెరిగితే అంతా ప్రైవేటు బస్సులవైపు మొగ్గుచూపుతారని ఆయన ఆరోపించారు. ప్రైవేటు ట్రావెల్స్ యాజమాన్యాలన్నీ టీడీపీ ప్రభుత్వ బినామీ సంస్థలవేనని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News