: కేంద్ర హోం మంత్రితో వైఎస్ జగన్ రహస్య మంతనాలు: విపక్ష నేతపై బీద రవిచంద్ర ఫైర్
వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై టీడీపీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఘాటు విమర్శలు చేశారు. కొద్దిసేపటి క్రితం నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ తెలుగు సంప్రదాయాలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అక్రమాస్తుల కేసు నుంచి బయటపడేందుకు జగన్ కేంద్ర హోం మంత్రితో రహస్య మంతనాలు సాగిస్తున్నారని కూడా రవిచంద్ర ఆరోపించారు. నెల్లూరు రొట్టెల పండుగ దర్గా కమిటీలో ఎలాంటి వివాదం లేదని, దీనిపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు.