: బీజేపీ మిత్రధర్మాన్ని పాటించాల్సి ఉంది: టీటీడీపీ నేత రావుల

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తన మిత్రపక్షం బీజేపీకి కొన్ని సూచనలు చేశారు. గతంలో మెదక్ లోక్ సభ, రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి టీడీపీ మద్దతు ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ మిత్రధర్మాన్ని పాటించాల్సిన అవసరం ఉందని, వరంగల్ ఎన్నికలో టీడీపీ పోటీ చేసేందుకు సహకరించాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో విశ్వాసం లేదని... టీఆర్ఎస్ పై ప్రజల ఆశలు సన్నగిల్లుతున్నాయని రావుల చెప్పారు. మోదీ, చంద్రబాబుపై నమ్మకంతో ప్రజలు టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తారని తెలిపారు.