: వారిని ఉరి తీయండి... లేకపోతే నేనే చంపేస్తా: కృపామణి అత్త
పశ్చిమగోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరులో కృపామణి అనే యువతి ఆత్మహత్యకు పాల్పడటం సంచలనం రేకెత్తిస్తోంది. దీని వెనకున్న కారణాలు దిగ్భాంతి గొలిపేలా ఉన్నాయి. కృపామణిని ఆమె తల్లిదండ్రులు స్థానిక నేత గుడాల శ్రీనివాస్ కు రూ. 7 లక్షలకు అమ్మారు. ఆమెతో వ్యభిచారం చేయించేందుకే అమ్మేశారు. ఈ క్రమంలో, ఆమె చాలా క్షోభను అనుభవించింది. గతంలో వీరిపై పోలీసులకు కూడా కృపామణి ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో వారంతా అరెస్ట్ అయి, ఆ తర్వాత బెయిల్ పై బయటకు వచ్చారు. అనంతరం బాధితురాలికి వేధింపులు మరింత ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. దీనిపై ఆమె అత్త వెంకటరమణమ్మ చాలా తీవ్రంగా స్పందించారు. కృపామణి ఆత్మహత్యకు కారణమైన వారిని ఉరితీయాలని, లేకపోతే తానే వారిని చంపేస్తానని అన్నారు. కృపామణి భర్త పవన్ కుమార్ మాట్లాడుతూ, తన భార్య చాలా మంచిదని, ఆమె తల్లి వల్లే ఈ దారుణం సంభవించిందని ఆరోపించాడు.