: మోదీతో సంబంధాలకు ఒబామా అత్యధిక ప్రాధాన్యత: అమెరికా


భారత ప్రధాని నరేంద్రమోదీతో గల సంబంధాలను బలోపేతం చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అత్యధిక ప్రాధాన్యత ఇస్తారని వైట్ హౌస్ డిప్యూటీ సెక్రటరీ ఎరిక్ షుల్జ్ తెలిపారు. ప్రధానంగా ఆర్థికపరమైన సంబంధాలను విస్తరించుకునే అంశంలో ఇరువురు నేతలు మంచి సంబంధాలను కలిగి ఉన్నారని చెప్పారు. ఈ రోజు మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎరిక్ షుల్జ్ ఈ విషయాలను తెలిపారు. మరోవైపు, పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ అమెరికా పర్యటనలో ఉన్న సమయంలో, వైట్ హౌస్ నుంచి ఇలాంటి ప్రకటన వెలువడటం విశ్లేషకులను ఆకట్టుకుంటోంది.

  • Loading...

More Telugu News