: చర్లపల్లి టూ చంచల్ గూడ... ‘సూరి’ కిల్లర్ భాను కిరణ్, పాతబస్తీ పహిల్వాన్ కూడా!


తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన మద్దెలచెరువు సూరి హత్య కేసు ప్రధాన నిందితుడు భాను కిరణ్ తన మకాంను చర్లపల్లి జైలు నుంచి చంచల్ గూడ జైలుకు మార్చనున్నాడు. ఎంఐఎం శాసనసభా పక్షనేత అక్బరుద్దీన్ ఓవైసీపై దాడికి దిగిన పాతబస్తీ పహిల్వాన్ కూడా అక్కడికే తరలిపోనున్నారు. వీరితో పాటు చర్లపల్లి జైల్లో ఉంటున్న దాదాపు 250 మంది ఖైదీలను తెలంగాణ జైళ్ల శాఖ చంచల్ గూడకు తరలించనుంది. చంచల్ గూడ జైలు నిండిపోవడంతో నిబంధనలను మార్చి కొందరిని చర్లపల్లి జైలుకు తరలించాల్సి వచ్చింది. అయితే చంచల్ గూడ జైల్లో కొత్తగా నిర్మించిన బ్యారక్ లను నిన్న తెలంగాణ హోం శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రారంభించారు. దీంతో ఈ కొత్త బ్యారక్ లలోకి చర్లపల్లి జైల్లో ఉంటున్న 250 మంది ఖైదీలను చంచల్ గూడకు తరలించేందుకు జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News