: బంగారు రథంపై శ్రీవారు.. రేపు స్వామి దర్శనాలు నిలిపివేత
చంద్రగ్రహణం కారణంగా రేపు తిరుమల వెంకటేశ్వరుడి దర్శనాలకు ఆటంకం కలగనుంది. గురువారం సాయంత్రం 5 గంటల నుంచి శుక్రవారం ఉదయం 9 గంటల వరకూ దర్శనాన్ని నిలిపివేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే ఆలయాన్ని సాయంత్రం 5 గంటల నుంచి అర్ధరాత్రి 1.30 వరకూ మూసివేస్తారు. మరోవైపు వార్షిక వసంతోత్సవాలలో భాగంగా నేడు మలయప్ప స్వామి బంగారు రథంపై తిరువీధులలో ఊరేగారు.