: రైల్వే ఫ్లాట్ ఫాం ఆమెకు ఆసుపత్రి అయింది!
మహబూబ్ నగర్ జిల్లా మద్దూర్ మండలం కానుగడ్డ గ్రామానికి చెందిన మల్లమ్మ కాన్పు కోసం పక్కనే వున్న కర్ణాటకలోని శేడంలోని ఆసుపత్రికి వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు, మెరుగైన వైద్యం కోసం ఆమెను తాండూరు ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. దీంతో ఆమె గుల్బర్గా నుంచి హైదరాబాదు వెళ్లే ప్యాసింజర్ రైలు ఎక్కింది. తాండూరు రైల్వే స్టేషన్ రాగానే రైలు దిగింది. అయితే, అప్పటికే నొప్పులు ఎక్కువ కావడంతో కుటుంబ సభ్యులు, అక్కడే ఉన్న మహిళల సాయంతో ప్లాట్ ఫాం మీదే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న రైల్వే అధికారులు బిడ్డను, ఆమెను ఆసుపత్రికి తరలించారు.