: ఇలాంటి తల్లిదండ్రుల్ని క్షమించకండి... ఆత్మహత్య చేసుకున్న ఓ అబల ఆర్తనాదం!


సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటుచేసుకుంది. భర్తతో గొడవ పడి వచ్చిన కుమార్తె కాపురం సరిదిద్దాల్సిన తల్లిదండ్రులు, ఆమెను 7 లక్షల రూపాయలకు ఓ కామాంధుడి దాహానికి అమ్మేశారు. తణుకు మండలం వేల్పూరుకు చెందిన కృపామణి... తన తల్లి, తండ్రి, సోదరుడు, మరో కామాంధుడు తన జీవితాన్ని నాశనం చేసిన వైనాన్ని సెల్ ఫోన్ వీడియోలో రికార్డు చేసి, వారిని క్షమించవద్దని భర్తను కోరుతూ, కుమారుడు కార్తీక్ ను బాగా చూసుకోవాలని చెప్పి ఆత్మహత్య చేసుకుంది. ఈ వీడియో రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ఆమె ఆవేదనపై ఆంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News