: మహేష్ బాబును కలిసి ఆహ్వానించిన సిద్ధాపురం వాసులు
సిద్ధాపురం గ్రామాన్ని దత్తత తీసుకుని సూపర్ స్టార్ మహేష్ బాబు నిజమైన ‘శ్రీమంతుడి’గా నిరూపించుకున్న సంగతి తెలిసిందే. తమ గ్రామాన్ని మహేష్ దత్తత తీసుకున్నందుకు కృతజ్ఞతగా సిద్ధాపురం వాసులు ఆల్ ఇండియా కృష్ణ, మహేష్ ఫ్యాన్స్ అధ్యక్షుడు ఖాదర్ గోరి ఆధ్వర్యంలో మహేష్ ను కలిశారు. ఈ సందర్భంగా తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. 'బ్రహ్మోత్సవం' షూటింగ్ లో ఉన్న మహేష్ బాబును కలిసిన వారిలో సిద్ధాపురం గ్రామ సర్పంచ్ ఎర్రోజు నర్సమ్మ, ఎంపీటీసీ బాలయ్య, శివాజీ యూత్ యువజన సంఘ కార్యకర్తలు ఉన్నారు. ఈ సందర్భంగా గ్రామాన్ని సందర్శించవలసిందిగా వారు మహేష్ బాబును కోరారు. వారి కోరిక ప్రకారం గ్రామాన్ని సందర్శిస్తానని మహేష్ మాటిచ్చాడు.