: రంజీలో సెహ్వాగ్ సెంచరీతో వీరవిహారం!
అంతర్జాతీయ క్రికెట్ నుంచి, ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన వీరేంద్ర సెహ్వాగ్ రంజీల్లో వీరవిహారం చేస్తున్నాడు. గతంలో హర్యాణా క్రికెట్ బోర్డుకు ఇచ్చిన మాట ప్రకారం, ఆ రాష్ట్ర జట్టుకు రంజీల్లో ఆడుతున్న సెహ్వాగ్ మైసూర్ లో జరుగుతున్న నేటి మ్యాచ్ లో 16 ఫోర్లు, 3 సిక్సుల సాయంతో 136 పరుగులు చేశాడు. అతనికి జయంత్ యాదవ్ (100) చక్కని సహకారమందించడంతో 90.1 ఓవర్లలో హర్యాణా జట్టు 331 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్ణాటక జట్టు 58 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు మాత్రమే చేసి వెనుకబడింది. కాగా, ఈ సీజన్ రంజీల్లో మాత్రమే సెహ్వాగ్ హర్యాణా తరపున ఆడనున్నాడు.