: నేను శిలా ఫలకాలపై పేర్ల కోసం పాకులాడే వ్యక్తిని కాదు: ఎంపీ గల్లా


శిలా ఫలకాలపై పేర్ల కోసం పాకులాడే వ్యక్తిని కాదని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమైన అనంతరం ఆయన మాట్లాడుతూ, అమరావతి శంకుస్థాపన కార్యక్రమం జాతీయస్థాయి కార్యక్రమమని అన్నారు. మన ఆలోచనలు కూడా అదే స్థాయిలో ఉండాలని ఆయన సూచించారు. ఢిల్లీలో కార్యక్రమం జరిగితే సర్పంచ్ గురించి ఆలోచించం కదా? అని ఆయన చెప్పారు. అతిథులను గౌరవించడం మన సంప్రదాయమని, శిలాఫలకాలపై పేర్ల కోసం పాకులాడే వ్యక్తిని కాదని ఆయన స్పష్టం చేశారు. అమరావతి కార్యక్రమంలో వివాదాలు వెతకడం మాని, విజయవంతమైనందుకు సంతోషిద్దామని ఆయన చెప్పారు.

  • Loading...

More Telugu News