: విభిన్న వంటకాల కోసం సొంతింటిని అమ్మేసిన జంట!


ప్రపంచంలో ఏ దేశంలో ఎలాంటి ఆహారం దొరుకుతుంది? వాటి రుచి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలని భావించిన జాక్ జాన్సన్, ఆయన సతీమణి దేశదేశాలు తిరిగేందుకు అవసరమైన డబ్బు కోసం తమ సొంతింటిని అమ్మేశారు. ఆపై వచ్చిన డబ్బు చేతిలో పెట్టుకుని ప్రయాణం ప్రారంభించారు. ఎక్కడికి వెళ్లాలి? ఎక్కడ ఏ ఐటమ్ ఫేమస్? వంటి విషయాలను ముందుగానే ఇంటర్నెట్ ద్వారా సెర్చ్ చేసి వెతుక్కుంటుందీ జంట. ఇప్పటికే ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలు తిరిగి, అక్కడి చిన్న చిన్న హోటళ్లు సైతం తిరిగేశారు. ఇప్పటివరకూ వీరు 540 రకాల వంటలను రుచి చూశారట. వరల్డ్ వైడ్ గా అన్ని దేశాలూ తిరిగి తమ నోటికి అన్ని వంటకాల రుచినీ చూపాలన్నది వీరి లక్ష్యం. "పుర్రెకో బుద్ధి - జిహ్వకో రుచి" అని ఊరికే అన్నారా?

  • Loading...

More Telugu News