: 'అలయ్ బలయ్' అంటే ఏంటో తెలుసా?


తెలంగాణలో దసరా పర్వదినం మరుసటి రోజున 'అలయ్ బలయ్'ని వేడుకగా నిర్వహిస్తారన్న సంగతి అందరికీ తెలిసిందే. తమ తమ బస్తీల్లో చోటా నేతల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రముఖులు తమ స్థాయికి తగ్గట్టు 'అలయ్ బలయ్' నిర్వహించి ఆహూతులకు పసందైన విందు ఇస్తారు. అసలు 'అలయ్ బలయ్' అంటే ఏమిటి? దీని గురించి వివరించారు కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. ఈ మధ్యాహ్నం పలువురు నేతలు, ప్రముఖులను ఆహ్వానించి 'అలయ్ బలయ్' నిర్వహించిన ఆయన మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను మరింతగా ప్రాచుర్యంలోకి తేవడానికి ఈ కార్యక్రమం ఉపకరిస్తుందని అన్నారు. 'అలయ్ బలయ్' అంటే 'ఆత్మీయ ఆలింగనం' అని చెప్పిన ఆయన, తన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ప్రతి ఒక్కరినీ కౌగిలించుకుని శుభాకాంక్షలు తెలిపారు. దీన్ని ప్రశంసిస్తూ, ప్రధాని మోదీ సందేశం పంపారని దత్తన్న చెప్పారు.

  • Loading...

More Telugu News