: అనంత టీడీపీలో మరో వర్గపోరు... ఈసారి గాంధీ విగ్రహం చుట్టూ వివాదం!
అనంతపురం జిల్లాలో జేసీ సోదరులు, ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా ఉన్న స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి బయటపడ్డాయి. నగరంలో మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించే విషయంలో గొడవ నెలకొంది. విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి నియోజకవర్గంలో ఏర్పాటు చేయగా, దాని ఆవిష్కరణను కావాలనే ఆలస్యం చేస్తున్నారన్నది జేసీ సోదరుల ఆరోపణ. విగ్రహాన్ని తక్షణం ఆవిష్కరించాలని, నెల రోజుల్లో ఆపని చేయకుంటే తానే స్వయంగా విగ్రహాన్ని ప్రారంభిస్తానని జేసీ హెచ్చరించారు. ప్రభాకర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జేసీ సోదరులు వాదిస్తుంటే, కాంగ్రెస్ నుంచి వచ్చి తెలుగుదేశంలో చేరి గొడవలు చేస్తున్నారని ప్రభాకర్ ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వీరి మధ్య నెలకొన్న వర్గపోరుతో ఎప్పుడేం జరుగుతుందోనని కార్యక్తరలు ఆందోళన చెందుతున్నారు.