: ఉద్యోగాల పేరిట 300 మంది యువతులకు వల...ఎఫ్ సీఐ మాజీ ఉద్యోగికి అరదండాలేసిన ‘షీ టీమ్‘ పోలీసులు
కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘భారత ఆహార సంస్థ’ (ఎఫ్ సీఐ)లో బంగారం లాంటి ఉద్యోగాన్ని వదులుకుని ‘కెరీర్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ’ని నెలకొల్పిన మధు అనే వ్యక్తి హైదరాబాదులో కొత్తగా దుకాణం తెరచాడు. పెద్ద సంఖ్యలో అమ్మాయిలకు వల వేశాడు. మూడు ఫేస్ బుక్ అకౌంట్లతో ఏకంగా 300 మంది అమ్మాయిలను ముగ్గులోకి దింపాడు. వీరిలో చాలా మందిపై అతడు వేధింపులకు దిగాడు. ఈ వేధింపులు మరింత ఎక్కువ కావడంతో ఓ నలుగురు యువతులు ‘షీ టీమ్’ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడు వాడిన టెక్నాలజీ సాయంతోనే అతడికి అరదండాలేశారు. పీడీ యాక్టు కింద అతడిపై కేసు నమోదు చేశారు.