: బాలీవుడ్ సింగర్ లాభ్ జాంజ్వా అనుమానాస్పద మృతి
షారూఖ్ ఖాన్ నటించిన 'రబ్ దే బనాది జోడీ' చిత్రంలో 'డ్యాన్స్ పే చాన్స్' అంటూ తన సుమధుర గళంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న బాలీవుడ్ సింగర్ లాభ్ జాంజ్వా అనుమానాస్పద స్థితిలో మరణించారు. ముంబైలోని బంగుర్ నగర్ కాలనీలోని తన అపార్టుమెంటులో ఆయన విగత జీవుడిగా కనిపించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ప్రస్తుతం దర్యాఫ్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. జాంజ్వా మృతిపట్ల బాలీవుడ్ ప్రపంచం దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. తన స్నేహితుడి ఆత్మకు శాంతి కలగాలని, ఇటువంటి సంతాప సందేశం రాయాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని కంపోజర్ ప్రీతం విచారం వ్యక్తం చేశాడు. పలు భాంగ్రా పాటలను పాడి ప్రజలకు చేరువైన జాంజ్వా మృతి బాలీవుడ్ కు తీరని లోటని పలువురు వ్యాఖ్యానించారు.