: ఉగ్రవాదుల అంతు చూస్తాం... అమెరికాకు ప్రామిస్ చేసిన పాక్ ప్రధాని!
ఎట్టి పరిస్థితుల్లోనూ తాము ఉగ్రవాదులకు అండగా నిలిచే సమస్యే లేదని, తమ దేశంలో ఉగ్రమూలాలను సమూలంగా తుడిచేస్తామని పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, అమెరికాకు హామీ ఇచ్చారు. ప్రస్తుతం యూఎస్ పర్యటనలో ఉన్న ఆయన, యూఎస్ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో పలు అంశాలను చర్చించారు. ఉగ్రవాదులను అణచివేసే విషయంలో పాక్ మెతగ్గా ఉందని ఒబామా ప్రస్తావించగా, దీనిపై షరీఫ్ స్పందించారు. హక్కానీ, లష్కరే తోయిబా వంటి సంస్థలపై కఠినంగా ఉంటామని వాగ్దానం చేశారు. ఆయన చేతిలో చెయ్యి వేసి ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపులేని పోరాటం చేస్తామని తెలిపారు. కాగా, ఇండియాతో కుదుర్చుకున్నటువంటి పౌర అణు ఒప్పందం, పాక్ తో కూడా కుదుర్చుకుంటుందని భావించినప్పటికీ, అటువంటిదేమీ లేదని అమెరికా స్పష్టం చేసింది.