: పాకిస్థాన్ లో భూకంపం... భయంతో పరుగులు తీసిన ప్రజలు
కొద్ది సేపటి క్రితం పాకిస్థాన్ లో భూకంపం సంభవించింది. పంజాబ్ ప్రావిన్స్ పరిధిలోని డాజల్ పట్టణానికి ఉత్తరంగా 11 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అమెరికన్ జియొలాజికల్ సర్వే సంస్థ వెల్లడించింది. రిక్టర్ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.3గా నమోదైనట్టు అధికారులు పేర్కొన్నారు. దీని కారణంగా ప్రాణనష్టం సంభవించినట్టు తమకు సమాచారం అందలేదని తెలిపారు. కాగా, భూ ప్రకంపనలకు ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఇళ్లలో నుంచి పరుగులు తీస్తూ బయటకు వచ్చారు. భూకంపంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.