: దేవరగట్టులో ఈ ఏటా రక్తం చిందింది... కర్రల సమరంలో 25 మందికి గాయాలు


కర్నూలు జిల్లా దేవరగట్టు గ్రామంలో జరిగే ‘బన్ని ఉత్సవం’లో ఈసారి ఎలాగైనా రక్తపాతాన్ని నివారించాలన్న జిల్లా ఎస్పీ రవికృష్ణ ఆశయం నెరవేరలేదు. ఏటా దసరా పర్వదినాన కర్రలు చేతబట్టి దేవర విగ్రహాన్ని తమ గ్రామానికి తీసుకెళ్లేందుకు పలు గ్రామాలకు చెందిన యువత మధ్య పోరాటం చోటుచేసుకోవడం అక్కడ ఆనవాయతీ. ఈ పోరులో వాడే కర్రల చివర ఇనుప కమ్మీలు తొడగడం, మద్యం సేవించి ఉత్సవంలో పాలుపంచుకోవడం తదితర కారణాలతో ఏటా రక్తం చిందుతోంది. పెద్ద సంఖ్యలో యువకులు గాయపడుతున్నారు. ఈ ఏడాది దీనిని నివారించాలని జిల్లా ఎస్పీ రవికృష్ణ విశ్వయత్నం చేశారు. కర్రల చివర ఇనుప కమ్మీలు లేకుండా చూడటంతో పాటు మద్యం సేవించిన వారిని పోరుకు దూరంగా ఉంచాలని ఆయన గ్రామస్థులకు సూచించారు. అంతేకాక దాదాపు వెయ్యి మందికి పైగా పోలీసులను రంగంలోకి దించారు. అయినా ఫలితం లేకపోయింది. పది గ్రామాలకు చెందిన యువత పాలుపంచుకున్న పోరు అర్ధరాత్రి మొదలై గంటల పాటు కొనసాగింది. మద్యం మత్తులో యువత రెచ్చిపోయింది. ఈ సమరంలో 25 మందికి గాయాలయ్యాయి.

  • Loading...

More Telugu News