: ముంబైలో చూసుకుంటాం: డివిలియర్స్


ఈ రోజు తమ ఆటగాళ్లంతా జట్టుగా విఫలమయ్యారని సౌతాఫ్రికా వన్డే జట్టు కెప్టెన్ డివిలియర్స్ తెలిపాడు. చెన్నైలో నాలుగో వన్డేలో ఓటమి పాలైన అనంతరం డివిలియర్స్ మాట్లాడుతూ, ముంబైలో జట్టుగా రాణిస్తామని అన్నాడు. బౌలింగ్, బ్యాటింగ్ విభాగాల్లో అంచనాల మేరకు రాణించలేదని డివిలియర్స్ తెలిపాడు. సిరీస్ ను గెలుచుకునేందుకు తమకు మరో అవకాశం మిగిలి ఉందని, దానిని ఎట్టిపరిస్థితుల్లోనూ వదులుకోమని ఆయన స్పష్టం చేశాడు. ముంబై వన్డేలో రాణించి సిరీస్ ను చేజిక్కించుకుంటామని డివిలియర్స్ తెలిపాడు.

  • Loading...

More Telugu News