: వెల్ డన్ భజ్జీ పా...5 వికెట్లు తీయాలి: సెహ్వాగ్


వెల్ డన్ భజ్జీ పా...ఈ రోజు నువ్వు 5 వికెట్లు తీయాలి... అంటూ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరుగుతున్న నాలుగో వన్డేలో పేస్ బౌలర్లను ఆటాడుకోవడంతో ధోనీ స్పిన్నర్లను రంగంలోకి దించాడు. దీంతో హర్భజన్ సింగ్, అక్షర్ పటేల్ సఫారీలను స్వేచ్ఛగా ఆడనీయకుండా కట్టుదిట్టమైన బంతులతో రక్షణలోకి నెట్టారు. దీంతో ఆటను గమనిస్తున్న సెహ్వాగ్ తన సహచరుడు హర్భజన్ ను ప్రోత్సహిస్తూ ట్వీట్ చేశాడు. సెహ్వాగ్ ట్వీట్ చేసిన వెంటనే హర్భజన్ మిల్లర్ ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. బంతి అంత వేగంగా ఎలా ప్యాడ్స్ ను ముద్దాడిందో అర్థం కాని మిల్లర్ తేరుకునేంతలోనే అంపైర్ అవుట్ గా ప్రకటించాడు. దీంతో టీమిండియా శిబిరం ఆనందంలో మునిగిపోయింది.

  • Loading...

More Telugu News